top of page

స్కూల్ డేస్ - బెల్ టైమ్స్

  • క్లయిడ్ కీ స్కూల్ లో విద్యార్థులుని 8:30 నుండి అనుమతిస్తారు

  • స్కూల్ బెల్ 9 గంటలకి మ్రోగుతుంది. బెల్ మ్రోగే టైం కి పిల్లలు అందరు స్కూల్ లో ఉండాలి, ఎవరైనా విద్యార్థులు ఆ సమయం

  • తరువాతి స్కూల్ కి వస్తే ముందుగా ఆఫీస్ రూమ్ కి వెళ్లి ఎందుకు లేట్ అయ్యిందో చెప్పి అక్కడ రిజిస్టర్ లో సంతకం చెయ్యాలి

  • ఉదయం టీ సమయం 10:30 నుండి 10:50, ఈ సమయం లో విద్యార్థులు వాళ్ళ తెచ్చుకున్న తిండి తిని కొద్దిగా ఆడుకుంటారు

  • మధ్యాహ్న సమయం 12:30 నుండి 1:25 వరకు భోజనం చేసి కొద్దిగా ఆడుకుంటారు

  • స్కూల్ 3 గంటలకి ముగుస్తుంది

  • ఎవరైనా విద్యార్థులు ఏదైనా కారణం చేత 3 గంటలకన్నా ముందుగా స్కూల్ నుండి వెళ్ళాలి అంటే తప్పకుండా ఆఫీస్ కి వెళ్లి కారణం చెప్పి వెళ్ళాలి

IMG_0742.JPG

స్కూల్ తరగతి గదులు

  • మాకు ఐదు తరగతులు (క్లాసులు) వున్నాయి. వాటిని మేము ఫణువు అని పిలుస్తాము

  • హరాకీకి లో 0 -1 తరగతి విద్యార్థులు వుంటారు

  • పాహుతుకవ లో 1 -2 తరగతి విద్యార్థులు వుంటారు

  • కరక లో 3 - 4 తరగతి విద్యార్థులు వుంటారు

  • నాయో లో 5 - 6 తరగతి విద్యార్థులు వుంటారు

  • రిమూ లో 7 - 8 తరగతి విద్యార్థులు వుంటారు

5 సంవత్సరాల వయస్సు కల్గిన పిల్లలు హరాకీకి క్లాసు తో ప్రారంభించి తరువాత పాహుతుకవ క్లాసు కి వెళ్తారు. అదే సంవత్సరం లో కూడా క్లాసులు మారుతారు. మిగతా అన్ని తరగతులలో విద్యార్థులు సంవత్సరం చివరిలో గ్రూపులుగా తరువాతి క్లాసులుకు వెళ్తారు.

స్కూల్ సిబ్బంది

  • మా స్కూల్ ప్రిన్సిపాల్ పేరు లిజ్ పరాటా. మేము అందరం ఆమెను ఫా లిజ్ అని పిలుస్తాము.

  • ప్రతీ క్లాసులో 1 కంటే ఎక్కువ టీచర్స్ వుంటారు

  • హరాకీకి క్లాసులో 3 టీచర్స్ వున్నారు. ప్రతి రోజు 2 టీచర్స్ క్లాసు లో వుంటారు. మా టీచర్స్ పేర్లు కెర్రీ, జేన్స మరియు కుర.

  • పాహుతుకవ లో టీచర్స్ పేర్లు సిల్వియా మరియు సాండ్రా

  • కరకా లో 3 టీచర్స్ వున్నారు. కామెరాన్, యానీ, మరియు కారోలిన్.

  • నాయో టీచర్స్ పేర్లు కీత్ మరియు లియోన్

  • రీము క్లాసులో టీచర్స్ పేర్లు మెల్ మరియు శాండీ

  • ఆఫీసులో 2 పని చేస్తారు. వారి పేర్లు హెలెన్ మరియు కాథరిన్

  • లైబ్రరీ ని అన్నెట్ నిర్వహిస్తారు

  • అమండా మా రీడింగ్ రికవరీ టీచర్, ఆమె ఇంకా ఇంగ్లీష్ నేర్చుకునే స్టూడెంట్స్ కి (ELL) ఇంగ్లీష్ నేర్పుతారు.

  • ఇంకా మా స్చవుల్ లో చాలామంది సహాయక సిబ్బంది వున్నారు. వారు మాకు అనేక రకాలుగా సహాయం చేస్తారు

  • రాబర్ట్ మా స్కూల్ కి సంరక్షకుడు గా పనిచేస్తున్నారు

IMG_0737.JPG
bottom of page